పుకార్లకు చెక్ పెట్టిన “గుడ్ లక్ సఖీ” మేకర్స్

సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “గుడ్ లక్ సఖీ”. దిల్ రాజు నిర్మించిన “గుడ్ లక్ సఖి” తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కీర్తితో పాటు ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రమప్రభ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు స్వరపరిచారు. నాగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. “గుడ్ లక్ సఖి” చిత్రంలో కీర్తి జాతీయ స్థాయిలో పోటీపడే షూటర్ గా నటిస్తోంది. జూన్ 3న విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే సోషల్ మీడియాలో ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు మొదలయ్యాయి. ఈ వార్తలపై మేకర్స్ స్పందించారు. “గుడ్ లక్ సఖి” చిత్రం ఓటిటిలో విడుదల అవుతుందనే పుకార్లను ఖండించారు. సినిమాపై ఏదన్నా అప్డేట్ ఉంటే మేమే ప్రకటిస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఆ పుకార్లకు చెక్ పడింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-