మ‌న‌దేశంలో ఏ న‌గ‌రాల్లో ఎంత స్వ‌చ్చ‌మైన గాలి ఉందో తెలుసా…!!

మ‌నిషి జీవించాలి అంటే గాలి ఉండాలి.  ఎక్క‌డ గాలి స్వ‌చ్ఛంగా ఉంటుందో అక్క‌డి ప్ర‌జ‌లు ఆరోగ్య‌వంతంగా జీవిస్తారు.  శీతాకాలం వ‌చ్చింది అంటే అనేక ప్రాంతాల్లో ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్ముకుంటుంది.  వాహనాల నుంచి వెలువ‌డే కాలుష్యం పొగ‌మంచు కార‌ణంగా ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోతుంది.  దీని వ‌ల‌న ప్ర‌జ‌లు శ్వాస‌సంబంధ‌మైన ఇబ్బందులు త‌లెత్తుతుంటాయి.  దేశ‌రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో వాయు కాలుష్యం తీవ్ర‌స్థాయికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే.  వాయు కాలుష్యాన్ని వాల్యూ ఇండెక్స్‌లో కొలుస్తారు.

Read: అధికారుల‌కు షాక్‌: టీకాలు వేసేందుకు ఆ గ్రామానికి వెళ్తే…

 సున్నా నుంచి 50 లోపు ఉండే గుడ్ అని, 50 నుంచి 100 వ‌ర‌కు ఉంటే ఫ‌ర్వాలేద‌ని, 100 దాటితే పూర్ అని, 300 దాటిటే వెరీ పూర్ అని పిలుస్తారు.  ప్ర‌స్తుతం ఢిల్లీ వెరీ పూర్ కేట‌గిరిలో ఉన్న‌ది.  ఢిల్లీలో వాల్యూ ఇండెక్స్ 330 ఉన్న‌ది.  మరి మ‌న‌దేశంలో మంచి గాలి ఉన్న న‌గ‌రాలు ఏవో ఎక్క‌డ ఉన్నాయో చూద్దాం.  

ఐజ్వాల్ న‌గ‌రంలో ఎయిర్ క్వాలిటీ వాల్యూ ఇండెక్స్ 13 గా ఉంది.  దీంతో ఈ న‌గ‌రం గుడ్ కేట‌గిరిలో చేరింది.  అలానే త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో 22, మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి న‌గ‌రంలో 23, దేవ‌న‌గ‌రే లో 24, విశాఖ‌ప‌ట్నంలో ఎయిర్ క్వాలిటి 25, రాజ‌మండ్రిలో 29, చిక్‌బ‌ళ్లాపూర్‌లో 32, తాల్చేరులో 38, శివ‌మొగ్గాలో 39, తిరువనంత‌పురం, మైసూర్‌లో 40, ఎర్నాకుళంలో 43, కొప్ప‌ళ్‌, హుబ్బ‌ళ్లి, విజ‌య‌పుర‌లో 44, పుదుచ్చేరి, కన్నూర్, బిలాస్‌పూర్, బ్రజ్‌రాజ్‌నగర్, చామరాజ నగర్ లో 45, కోజికోడ్‌లో 46, ఎలోర్‌లో 48, బెంగ‌ళూరులో 49, కొల్లం, కలబురిగిలో 50 ఎయిర్ క్వాలిటీ ఉన్న‌ట్టు కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ సంస్థ తెలియ‌జేసింది.  

Related Articles

Latest Articles