గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇక ప్రైవేట్ ఈవెంట్… ఈ వివాదమే కారణమా?

రాపర్, నటుడు స్నూప్ డాగ్ గత నెలలోనే 79వ గోల్డెన్ గ్లోబ్‌కు నామినేషన్‌ను ప్రకటించారు. నామినీలలో లేడీ గాగా (హౌస్ ఆఫ్ గూచీ), నికోల్ కిడ్‌మాన్ (బీయింగ్ ది రికార్డోస్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), డెంజెల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మక్‌బెత్) ఉన్నారు. అయితే ఎప్పటిలాగా ఈసారి కూడా ఈ ఈవెంట్ లైవ్ లో ప్రసారం కావడం లేదు. అవార్డు విజేతలను ఆన్‌లైన్‌లో మాత్రమే ప్రకటిస్తారు. ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రైవేట్ ఈవెంట్ కాబోతోంది. అయితే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం గత ఏడాది అవార్డ్స్ విషయంలో జరిగిన వివాదమే కారణమని తెలుస్తోంది.

Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్

హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA)పై విమర్శలు వచ్చాక… ఈ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేయాల్సిన ప్రసార సంస్థ NBC సదరు అవార్డ్స్ ఈవెంట్ నిర్వాహకులతో ఒప్పందాన్ని రద్దు చేసుకుందట. 2021 గోల్డెన్ గ్లోబ్స్ వేడుక వివాదాస్పదమైంది. HFPA పై లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ తర్వాత అవార్డులకు ఓటు వేసిన 87 మంది సభ్యుల్లో ఒక్కరు కూడా నల్ల జాతీయులు లేకపోవడం, పైగా నామినీలను నిర్ణయించేటప్పుడు లంచం తీసుకున్నారని ఆరోపణలు రావడం వివాదానికి కారణమైంది. అయితే గతేడాది అక్టోబర్‌లోనే 21 మంది కొత్త సభ్యులను చేర్చుకున్నామని, అందులో 6 మంది నల్లజాతీయులు ఉన్నారని HFPA తెలిపింది. ఇక త్వరలోనే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విజేతలను తమ అధికారిక వెబ్సైట్లలో ప్రకటిస్తామని HFPA సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Related Articles

Latest Articles