కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్ లో బంగారం ప‌ట్టివేత‌… అధికారుల‌ను బురిడీ కొట్టించాల‌ని ప్ర‌య‌త్నించి…

విదేశాల నుంచి బంగారం స్మ‌గ్లింగ్ ఎక్కువ‌గా జరుగుతుండ‌టంతో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల్లో నిఘాను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు.  ఇటీవ‌లే చెన్నై, హైద‌రాబాద్‌లో విదేశీ బంగారం భారీగా బ‌య‌ట‌ప‌డింది.  ఇప్పుడు కొచ్చిన్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో విదేశీ బంగారాన్ని అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  షార్జా నుంచి కేర‌ళ వ‌చ్చిన ముగ్గురు లేడీ ప్ర‌యాణికుల వ‌ద్ద నుంచి దాదాపు రెండు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు క‌స్ట‌మ్స్ అధికారులు.  బంగారాన్ని పేస్టుగా మార్చి ఆ పేస్టును క్యాప్సుల్స్ లో నింపి, వాటిని మ‌ల‌ద్వారంలో దాచి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు.  అయితే, ఎయిర్‌పోర్ట్ లో ముగ్గురు ప్ర‌యాణికుల‌పై అనుమానం రావ‌డంతో అధికారులు అదుపులోకి తీసుకొని త‌మ‌దైన శైలిలో విచారించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.  ముగ్గురు మ‌హిళ‌ల‌పై కేసులు న‌మోదు చేసి, బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-