చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టివేత…

చెన్నై ఎయిర్‌పోర్ట్ లో విదేశీ బంగారం పట్టుకున్నారు. దుబాయ్ ప్రయాణీకుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు. కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ ఫక్కీలో మలద్వారం లో దాచాడు కేటుగాడు. కానీ చెన్నై ఎయిర్‌పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయటపడింది అక్రమ బంగారం రవాణా. 810 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణీకుడు చెన్నై లోని విలుప్పురానికి చెందిన చంద్ర శక్తివేల్ గా గుర్తించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-