గోల్డ్ స్మగ్లింగ్.. కేటుగాళ్ళ రూటే సెపరేటు

బంగారం రేటు పెరుగుతుండడంతో కేటుగాళ్ళు రూట్ మార్చేస్తున్నారు. బంగారాన్ని విదేశాలనుంచి అక్రమంగా దేశంలోకి తెస్తున్నారు. వివిధ రూపాల్లో బంగారం దేశంలోకి ఎంటరవుతోంది. పేస్టు రూపంలో, బ్యాగ్ లు, సెల్ ఫోన్ బ్యాటరీలు, క్యాప్సుల్స్, పిల్లలు ఆడుకునే బొమ్మల రూపంలో .. కస్టమ్స్ కళ్ళుగప్పి మరీ తెచ్చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్.. ఎయిర్ పోర్టులు వేరైనా జరిగేది మాత్రం బంగారం స్మగ్లింగ్.

తాజాగా చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొలంబో ప్రయాణీకుల వద్ద 86 లక్షల విలువ చేసే 2 కేజీల బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు. బంగారం సీజ్, ఇద్దరు ప్రయాణీకులపై కేసు నమోదు చేశారు. బంగారాన్ని పేస్టుగా మార్చి, క్యాప్సూల్ లో నింపి పొట్టలో దాచారు కేటుగాళ్లు. విమానాశ్రయంలో దిగి వారు నడుస్తుండగా అనుమానం వచ్చింది. వారి నడవడికలో అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేశారు కస్టమ్స్ అధికారులు. పొట్టలో వున్న బంగారం గుట్టును రట్టు చేశారు కస్టమ్స్ బృందం. బంగారం సీజ్ చేసి, ఇద్దరు ప్రయాణీకులపై కేసు నమోదు చేశారు. ఈ బంగారం ఎక్కడినించి తెచ్చారు, వీరి వెనుక వున్నది ఎవరనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Related Articles

Latest Articles