గుడ్ న్యూస్ ; స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధరలు

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వరుసగా బంగారం ధరలు పెరుగుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేయాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 180 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది.

Related Articles

Latest Articles