బంప‌ర్ ఆఫ‌ర్‌: గ్యాస్‌ను ఇలా బుక్‌చేస్తే…బంగారం ఉచితం…

దేశంలో గ్యాస్ ధ‌ర‌లు ఇటీవ‌లే మ‌రోసారి పెరిగిన సంగ‌తి తెలిసిందే.  వంట గ్యాస్‌పై రూ.15 పెంచారు.  గ్యాస్‌ను బుక్‌చేసుకునే విధానంను బ‌ట్టి క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టిస్తున్నాయి సంస్థ‌లు.  పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకుంటే రూ.800 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ వ‌చ్చేది.  అయితే ఇప్పుడు క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ కాకుండా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది పేటీయం.  పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా బంగారాన్ని ఇవ్వ‌బోతున్న‌ది.  ద‌స‌రా, దీపావ‌ళి సంద్భంగా ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.  పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసుకున్న వారిని ల‌క్కీ డ్రా ఎంపిక చేసి ఐదుగురికి 10001 విలువైన బంగారాన్ని అందిస్తారు.  ఇది పేటీయం గోల్డ్ రూపంలో ఉంటుంది.  ఈ గోల్డ్ బ్యాలెన్స్‌ను విక్ర‌యించి డబ్బు తీసుకోవ‌చ్చు లేదంటే 10001 విలువైన బంగారం కోసం రిక్వెస్ట్ పెట్టుకోవ‌చ్చు.  ఇక మామూలుగా పేటీయం ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి 100 విలువైన స్క్రాచ్ కార్డును అందిస్తోంది.  

Read: ద‌స‌రా బాదుడు మొద‌లైంది…

-Advertisement-బంప‌ర్ ఆఫ‌ర్‌:  గ్యాస్‌ను ఇలా బుక్‌చేస్తే...బంగారం ఉచితం...

Related Articles

Latest Articles