నవమినాడు మగువలకు గుడ్ న్యూస్: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు 

నవమినాడు మగువలకు గుడ్ న్యూస్: మళ్ళీ తగ్గిన బంగారం ధరలు 

కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి బంగారం ధరలు పెరగడం మొదలుపెట్టాయి.  వినియోగదారులు బంగారంపై పెట్టుబడులు పెడితే సేఫ్ అనే ఉద్దేశ్యంతో వాటిపై పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు పెరిగాయి.  అయితే, దేశంలో వ్యాక్సినేషన్, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించే అవకాశం లేదని ప్రధాని స్పష్టం చేయడంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడింది.  ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.44,150కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి 48,160కి చేరింది.  బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా తగ్గాయి.  కిలో వెండి ధర రూ.600 తగ్గి రూ.73,600కి చేరింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-