మ‌గువ‌ల‌కు గుడ్‌న్యూస్ః దిగొచ్చిన పుత్త‌డి ధ‌ర‌లు…

క‌రోనా మ‌హమ్మారి త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో తిరిగి ప్ర‌జాజీవ‌నం మామూలు స్థితికి చేరుకుంటోంది.  క‌రోనాతో పాటుగా అటు పుత్త‌డి ధ‌ర‌లు కూడా క్ర‌మంగా త‌గ్గుముఖం పడుతున్నాయి.  గ‌త కొన్ని రోజులుగా పుత్త‌డి ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి.  ఈరోజు కూడా భారీగా ధ‌ర‌లు త‌గ్గాయి.  హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో పుత్త‌డి ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి.  

Read: ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.260 త‌గ్గి రూ.43,990కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.280 త‌గ్గి రూ.47,990కి చేరింది.  బంగారం ధ‌ర‌లు దిగిరావ‌డంతో వినియోగ‌దారులు పుత్త‌డిని కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.  ఇక‌, వెండి ధ‌ర‌లు కూడా దిగొస్తున్నాయి.  కిలో వెండి ధ‌ర రూ.900మేర తగ్గి 73,100 కి చేరింది.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-