మహిళలకు షాక్‌ : మరోసారి పెరిగిన పసిడి ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గ‌త వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధ‌ర‌లు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

read also :జులై 30 శుక్రవారం దినఫలాలు :బంగారు, వస్త్ర, కిరాణా వ్యాపారస్తులకు లాభాలు

హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గి పోయాయి. కిలో వెండి ధర రూ.4200 తగ్గి 67,200 కు చేరుకుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-