మహిళలకు షాక్… మరోసారి పెరిగిన బంగారం ధరలు

మన దేశంలో బంగారంకు ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. మన దేశ మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఎంతో ఇష్టపడతారు. అయితే… గ‌త వారం రోజులుగా భారీగా పెరుగుతోంది. తాజాగా… పుత్తడి ధ‌ర‌లు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి.

read also : “రాక్షసుడు-2″లో ఈ స్టార్ హీరోనా ?

క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 5200 తగ్గి 69,200 కు చేరుకుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-