మహిళలకు మరోసారి షాక్ : 50 వేలకు మార్కును తాకిన బంగారం ధరలు

గ‌తఐదు రోజులుగా స్థిరంగా ఉన్న పుత్త‌డి ధ‌ర‌లు ఈరోజు తిరిగి భారీగా పెరిగాయి. ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని అనుకున్న వినియోగ‌దారుల‌కు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. క‌రోనా వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, కొన్ని చోట్ల మార్కెట్లు తిరిగి పుంజుకోవ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి రూ. 45,800 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90 పెరిగి రూ.49,950 కి చేరింది. ఇక బంగారం బాట‌లోనే వెండి కూడా న‌డిచింది. కిలో వెండి ధ‌ర రూ.100 పెరిగి రూ. 76,200కి చేరింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-