మగువలకు గుడ్‌న్యూస్‌.. కాస్త తగ్గిన పసిడి ధర

బంగారం కొనాలని చూసేవారికి కాస్త ఊరట లభించింది.. పసిడి ధరలు మరోసారి తగ్గాయి.. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.48,230కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.44,200కు పడిపోయింది.. ఇక, వెండి కూడా బంగారం బాటనే పట్టింది.. రూ.300 తగ్గడంతో కిలో వెండి ధర రూ.68,400కు దిగివచ్చింది. ఇక్కడ ఇలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర మాత్రం పైకి కదిలింది.. ఔన్స్‌కు 0.15 శాతం పెరగడంతో పసిడి రేటు ఔన్స్‌కు 1814 డాలర్లకు ఎగసింది. ఇక, ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 23.96 డాలర్లకు పెరిగింది వెండి ధర.

Related Articles

Latest Articles

-Advertisement-