గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర

బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి గుడ్‌ న్యూస్‌.. క్రమంగా పసిడి ధర దిగివస్తూనే ఉంది.. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గిపోయింది.. గత మూడు రోజుల్లో 560 రూపాయలు తగ్గడంతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000కి క్షీణించింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గుదలతో రూ.44,000కు పడిపోయింది. మరోవైపు.. పసిడి బాటలోనే వెండి ధర కూడా కిందకు దిగివచ్చింది.. గత మూడు రోజుల్లో రూ.1500 పతనం కావడంతో కొలో వెండి ధర రూ.68,300కు తగ్గిపోయింది.

Related Articles

Latest Articles

-Advertisement-