బంగారం కొనేవారికి గుడ్ న్యూస్ : భారీగా పడిపోయిన ధరలు

గ‌తేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా స‌మ్మ‌ర్‌లో క‌రోనా కేసుల‌తో పాటుగా బంగారం ధ‌ర‌లు కూడా పెర‌గ‌డం మొద‌లుపెట్టాయి. అయితే ఈరోజు బంగారం ధ‌ర‌లు కాస్త తగ్గాయి. తగ్గిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 తగ్గి రూ. 45,700 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 240 తగ్గి రూ. 49,860కి చేరింది. దేశీయంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమ‌లు జరుగుతుండ‌టంతో చాలా మంది బంగారంపై పెట్టుబ‌డులు పెడుతుండ‌టంతో ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి. అటు వెండి ధరలు మాత్రం కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 76,100 కు చేరింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-