ఎల్లుండి జీఆర్‌ఎంబీ సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణా బేసిన్‌లో జల జగడం తారాస్థాయికి చేరుకోగా.. గోదావరి బేసిన్‌లోనూ పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.. దీంతో.. ఇరు రాష్ట్రాల మధ్య జలజగడానికి ముగింపు పలుకుతామంటూ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది.. ఇది, కొన్ని కొత్త సమస్యలకు కూడా కారణమైందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ నెల 17వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సబ్‌ కమిటీ సమావేశంకానుంది.. హైదరాబాద్‌ జలసౌధాలో ఉదయం 11 గంటలకు జీఆర్‌ఎంబీ సబ్‌ కమిటీ సమావేశం ప్రారంభం కానుండగా.. ఇందులో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి శాఖ విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చించనున్నారు.. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులు హాజరుకానున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-