టీఎంసీలో చేరిన మాజీ సీఎం..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృష్టిసారించారు ఆ పార్టీ అధినేత, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. ఆ బాధ్యతను తన మేనల్లుడికి అప్పగించారు.. ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. గోవాపై కూడా టీఎంసీ దృష్టిసారించింది.. ఇవాళ గోవా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత లూజినో ఫలీరో.. టీఎంసీ గూటికి చేరారు.. కోల్‌కతాలోని టీఎంసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక నేత ఆకాష్ బెనర్జీ.. పార్టీ కండువా కప్పి.. లూజిఓ ఫలీరోను టీఎంసీలోకి ఆహ్వానించారు.. ప్రస్తుతం గోవాలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గోవాకు మమతా బెనర్జీ నాయకత్వం అవసరం ఉందని, అందుకే తాను టీఎంసీలో చేరినట్లు తెలిపారు.. మా రాష్ట్రానికి నమ్మకమైన ప్రత్యామ్నాయం కావాలి.. ఆ నమ్మకమైన ప్రత్యామ్నాయం మమతా బెనర్జీలో కనిపించందన్నారు.. గోవా సంస్కృతి, అక్కడి భిన్నత్వం.. ఇప్పుడు చాలా ప్రమాదంలో పడిందని.. తాను మమతా బెనర్జీనికి గోవాకు రావాలని విజ్ణప్తి చేస్తున్నాను అన్నారు లూజినో ఫలీరో. మరోవైపు.. మమతా బెనర్జీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

-Advertisement-టీఎంసీలో చేరిన మాజీ సీఎం..

Related Articles

Latest Articles