జీమెయిల్ స‌రికొత్త రికార్డ్‌…

గూగుల్ సంస్థ‌కు చెందిన జీమెయిల్ స‌రికొత్త రికార్డ్‌ను సొంతం చేసుంది.  ఆండ్రాయిడ్ వెర్ష‌న్స్‌లో 10 బిలియ‌న్ల ఇన్‌స్టాల్‌గా యాప్‌గా రికార్డ్ సాధించింది. 10 బిలియ‌న్ల ఇన్‌స్టాన్‌లు సాధించిన నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది.  గూగుల్ ప్లే స్టోర్‌, యూట్యూబ్‌, గూగుల్ మ్యాప్‌లు ఈ రికార్టును సాధించ‌గా, నాలుగో యాప్‌గా జీమెయిల్ నిలిచింది.  జీమెయిల్‌ను 2004లో వాడుక‌లోకి తీసుకొచ్చారు.  ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్లు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఇన్‌బిల్డ్‌గా జీమెయిల్‌ను కొన్ని స్మార్ట్‌ఫొన్లు అందిస్తున్నాయి.  ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగ దారుల‌కు అనుగుణంగా ఎన్నో ఫీచ‌ర్ల‌ను జీమెయిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  మెయిల్ స‌ర్వీస్‌తో పాటు మెసేజింగ్ సౌక‌ర్యం, వీడియో కాలింగ్ సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది జీమెయిల్ సంస్థ‌. వినియోగ దారుల‌ను పెంచుకుంటూనే, హ్యాకంగ్ కాకుండా ఉండేవిధంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది జీమెయిల్‌. 

Read: ఆంక్ష‌లు ఎత్తివేసే ఆలోచ‌న‌లో ఢిల్లీ ప్ర‌భుత్వం…

Related Articles

Latest Articles