సీలింగ్‌లో ఇరుక్కున్న బాలిక త‌ల‌… గంట‌కు పైగా క‌ష్ట‌ప‌డి…

చిన్న పిల్ల‌లకు ఏదైనా కొత్త‌గా క‌నిపిస్తే దానిని ప‌రిశీలించి చూస్తారు.  అందులో ఏముందో తెలుసుకోవ‌డానికి ఎక్కువ ఆస‌క్తి చూపుతారు.  ఇలానే, ఓ చిన్నారి త‌న ఇంట్లోని పై గ‌దిలో ఉన్న చిన్న క‌న్నంలోకి త‌ల‌పెట్టింది.  అలా దూరిన త‌ల మ‌ర‌లా తీసేందుకు రాలేదు.  దీంతో భ‌య‌ప‌డిన చిన్నారి పెద్ద‌గా కేక‌లు వేయ‌డం మొద‌లు పెట్టింది.  ఆ కేక‌లు విన్న త‌ల్లిదండ్రులు ప‌రుగున అక్క‌డికి చేరుకున్నారు.  కూతురిని ఆ క‌న్నం నుంచి బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేశారు.  కానీ కుద‌ర‌క పోవ‌డంతో వెంట‌నే ఫైర్ స్టేష‌న్‌కు ఫోన్ చేశారు.  అగ్నిమాప‌క సిబ్బంది మొద‌ట డ్రిల్లింగే చేసేందుకు ప్ర‌య‌త్నం చేశారు.  కాని సీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండంతో వెజిటేబుల్ ఆయిల్‌ను ఆ క‌న్నానికి చిన్నారి మెడ‌కు అప్లై చేస్తూ త‌ల‌ను మెల్లిగా బ‌య‌ట‌కు తీశారు.  అదృష్ట‌వ‌శాత్తు ఆ చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు.  అగ్నిమాప‌క సిబ్బంది స‌కాలంలో వ‌చ్చి ఆ పాప‌ను ర‌క్షించ‌డానికి క‌నీసం గంట స‌మ‌యం ప‌ట్టింది.  

Read: 48 ఏళ్లుగా ఆ వ్యక్తి నిద్రపోవడం లేదట‌…

Related Articles

Latest Articles

-Advertisement-