సాయిధరత్‌ తేజ్‌కు ప్రమాదం: జీహెచ్‌ఎంసీ ప్రత్యేక చర్యలు.. ఇక అంతే..!

సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనమే సృష్టించింది.. హైదరాబాద్‌లో బైక్‌ స్కిడ్‌ అయి ఆయన పడిపోయారు.. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తేజ్‌ పరిస్థితి నిలకడగా ఉందని.. శ్వాస తీసుకోవడం కొంత మెరుగైందని తాజా హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు అపోలో వైద్యులు.. మరోవైపు.. సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అధికారులు.. రోడ్ల మీద భవన నిర్మాణ వ్యర్థాలను వేస్తున్న వారిపై చర్యలకు పూనుకుంటున్నారు.. మాదాపూర్ ఖానామెట్‌లో నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్స్రక్షన్ కంపెనీకి లక్ష రూపాయల జరిమాన విధించారు జీహెచ్ఎంసీ చందానగర సర్కిల్ అధికారులు… కాగా, సాయి ధరమ్ తేజ్‌ వెళ్తున్న బైక్‌.. రోడ్డుపై ఉన్న ఇసుకలో స్కిడ్‌ కావడం వల్లే ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి రోడ్డు ప్రమాదం జరిగిన మరునాడు.. ఘటనా స్థలంలో రోడ్డుపై మట్టి కనిపించడగా.. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ దానిని క్లీన్‌ చేసిన సంగతి తెలిసిందే.. ఈ వ్యవహారంలో జీహెచ్‌ఎంసీపై విమర్శలు వచ్చాయి.

Related Articles

Latest Articles

-Advertisement-