13 ఏళ్ల బాలికపై జీహెచ్ఎంసీ ఉద్యోగి దారుణం : బాత్రూమ్ లోకి వెళ్ళాక మరీ !

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కాపాలదారు కూతురు(13)పై జిహెచ్ఎంసి ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతువుల సంరక్షణ కేంద్రం (Animal Care center)లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షెల్టర్ మేనేజర్ గా గత కొన్నేళ్లుగా ఔట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ రావు తన కుటుంబంతో కలిసి అక్కడే ఉంటూ జంతువుల సంరక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడే బాధిత బాలిక తల్లి రహేమా కాపాలదారుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రహేమా కూతురుపై భాస్కర్ రావు కన్నేశాడు. ఇందులో భాగంగా బాలిక తల్లికి ఇతర పని చెప్పి.. తప్పుదోవ పట్టించాడు భాస్కర్ రావు.. అనంతరం ఆమె కూతురు బాత్రూమ్ కి వెళ్లగా.. అక్కడే ఉండి అత్యాచారానికి యత్నించాడు భాస్కర్ రావు. అయితే భాస్కర్ రావు దాడిని ఎదురించిన బాలిక..గట్టిగా అరుస్తూ బయటకు వచ్చింది. విషయం తెలియగానే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాలిక తల్లి. కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు..నిజాలు తేల్చే పనిలో పడ్డారు. అయితే ఈ ఘటనలో బాధితులకు తోటి జిహెచ్ఎంసి సిబ్బంది అండగా నిలిచింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-