ఆకట్టుకుంటున్న “కపట నాటక సూత్రధారి” సాంగ్

విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్, మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో సరికొత్త కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘కపట నాటక సూత్రధారి’. మనీష్ (హలీమ్) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని క్రాంతి సైనా డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సుభాష్ దొంతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రామ్ తవ్వ సంగీతం సమకూరుస్తున్నారు. రామకృష్ణ మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ రచయిత కోన వెంకట్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి “ఘల్లు ఘల్లు” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. సాయి చరణ్, హరిణి ఈ సాంగ్ ను ఆలపించగా… శ్రీనివాస్ సూర్య లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-