ఆనందయ్య మందు వల్ల కంటి చూపుకి ఎలాంటి ప్రమాదం లేదు…

కృష్ణపట్నం ఆనందయ్య మందు తీసుకుని జిజిహెచ్ లో ఇప్పటి వరకు 160 మంది అడ్మిట్ అయ్యారు అని జిజిహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ తెలిపారు. ఇక్కడకు వ్వచ్చేసరికి కోటయ్యకు చేసిన ఆర్టీ పిసి ఆర్ లో నెగిటివ్ వచ్చింది. అందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చామని చెబుతున్నారు. ప్రస్తుతం జీజిహెచ్ లో160 మంది ఆక్సిజెన్ పైనే చికిత్స పొందుతున్నారు. 8 మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. కోటయ్య ను సాధారణ కోవిడ్ పేషేంట్ లాగానే ట్రీట్ చేశాము. అడ్మిట్ అయిన తర్వాత నలుగురు వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందించాం అని తెలిపారు. నోడల్ ఆఫీసర్ నరేంద్ర మాట్లాడుతూ… ఆనందయ్య కంటి మందు తీసుకున్న వారిలో కంటి చూపు కి ఎలాంటి ప్రమాదం లేదు.. మేము పరీక్షించి చూశాం. ఆరుమంది కోలుకుని ఇంటికి వెళ్ళారు అని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-