గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్

మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం విశేషం. రేపు ఉదయం 10 గంటలకు ఈ అప్డేట్ రానుంది. “సీటిమార్” ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ గెస్ట్ గా రావచ్చని, అదే విషయాన్ని రేపు టీం ప్రకటిస్తుందని అంటున్నారు. మరి టీం ప్రకటించబోయే ఆ మెగా అప్డేట్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : మీ మాటలు గ్రేటెస్ట్ రివార్డులు… అమితాబ్ కు సూర్య రిప్లై

యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో విడుదల కానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-