రచ్చ షురూ చేయండి.. సర్కారు వారు వచ్చేస్తున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత నాలుగు నెలలుగా ఎలాంటి కొత్త అప్డేట్ లేకపోవడంతో నిరాశకు గురైన అభిమానులు థమన్ చెప్పిన న్యూస్ తో రచ్చ చేయడానికి రెడీ అయిపోయారు. ” మేము విన్నాం.. మేము వింటున్నాం.. త్వరలోనే మేము మీకు వినిపిస్తాం.. డైరెక్టర్ పరుశురామ్ .. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి కి సూపర్ బెస్ట్ ఇచ్చారు.. దానికోసం చిత్ర బృందం ఎంతో కష్టపడింది” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ ట్వీట్ కి డైరెక్టర్ పరుశురామ్ స్పందిస్తూ ” వచ్చే రోజుల గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. సర్కారు వారి పాట ఆల్బమ్ మీ సూపర్ బెస్ట్ వర్క్ లలో ఒకటిగా గుర్తుండిపోతుంది థమన్ గారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్స్ విన్నాకా సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ ని సంక్రాంతికి కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటినుంచే అభిమానులు రచ్చ షురూ చేశారు. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles