దారుణం: శృంగారానికి ఇంటికి పిలిచి.. ప్రైవేట్ పార్ట్స్ కోసి తినేసాడంట

ప్రపంచంలో ఎన్నో క్రైమ్స్ వినే ఉంటాం .. చదివే ఉంటాం.. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్న క్రైమ్ ని మాత్రం ఎక్కడా విని ఉండం .. కనీసం చదివి కూడా ఉండం. అంతటి దారుణమైన క్రైమ్ కి పాల్పడ్డాడు ఒక టీచర్. ఈ దారుణ ఘటన జర్మనీలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. జర్మనీలో స్టెఫాన్‌ ఆర్‌ అనే వ్యక్తి ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహించి రిటైర్ అయ్యాడు. అతను స్వలింగ సంపర్కుడు. దీంతో ఒక డేటింగ్ యాప్ ద్వారా అబ్బాయిలను పరిచయం చేసుకొని శృంగారానికి ఇంటికి పిలుస్తాడు. అలానే ఒక వ్యక్తిని 2020 అక్టోబర్ లో శృంగారం చేద్దామని చెప్పి ఇంటికి పిలిచాడు. అతను వచ్చాకా డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ తప్పేలా చేసి అతని గొంతు కోసి చంపాడు. అనంతరం అతని ప్రైవేట్ పార్ట్ ని కోసి తినేశాడు. మిగతా బాడీ ని ముక్కలు ముక్కలుగా కోసి చుట్టుపక్కల విసిరేశాడు. అయితే పోలీసులు బెర్లిన్‌ పార్కులో మానవ అవశేషాలను గుర్తించడంతో నవంబర్‌ 2020న ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అవశేషాలను గుర్తించి అతనిని స్టెఫాన్‌ టీ అనే వ్యక్తివిగా గుర్తించారు. అతడి ఫోన్ ఆధారంగా నిందితుడు స్టెఫాన్‌ ఆర్‌ గా గుర్తించిన పోలీసులు అతడి ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మరకలు.. మరికొన్ని అవశేషాలు ఉండడంతో నరమాంస భక్షకుడిగా గుర్తించి అతనిని అరెస్ట్ చేశారు.ఇక ఈ కేసుపై తాజాగా కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చారు. తన 30 ఏళ్ళ సర్వీసులో ఇలాంటి నేరం చుడాల్డాని తెలుపుతూ.. ఒక మనిషిని అతి కిరాతకంగా చంపి, అతని ప్రైవేట్ భాగాలను కోసి తినడమనేది అమానుషమైన ఘటనగా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తు తీర్పునిచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

Related Articles

Latest Articles