జ‌ర్మ‌నీ కీల‌క నిర్ణ‌యం…జూన్ 7 నుంచి పిల్ల‌ల‌కు టీకా…

యూర‌ప్ ఖండం క‌రోనా నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత యూర‌ప్ ఖండంలో వేగంగా వ్యాక్సినేష‌న్ చేస్తున్నారు.  ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా విద్యాసంవ‌త్స‌రం చాలా వ‌ర‌కు దెబ్బ‌తిన్న‌ది.  ఆగ‌స్టు నుంచి కొత్త విద్యాసంవ‌త్స‌రం ప్రారంభం అవుతుంది.  ఈ నేపథ్యంలో జూన్ 7 వ తేదీ నుంచి 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లకు క‌రోనా టీకా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  ఫైజ‌ర్ లేదా బ‌యో ఎన్‌టెక్ క‌రోనా టీకాలు ఇవ్వ‌డానికి యూరోపియ‌న్ మెడిసిన్స్ ఎజ‌న్సీ ఆమోదం తెలిపింది.  దీంతో జూన్ 7 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వ‌బోతున్నారు.  జులై చివ‌రి నాటికి 12 నుంచి 15 ఏళ్లు వ‌య‌సు వారికి మొద‌టిడోసు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-