వేర్వేరు టీకాలు తీసుకున్న జ‌ర్మ‌నీ ఛాన్సలర్‌…

ప్ర‌పంచంలో టీకాల‌ను వేగంగా అందిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  కొన్ని దేశాల్లో సగం మందికంటే ఎక్కువ జ‌నాభాకు వ్యాక్సిన్ అందించారు.  అలాంటి వాటిల్లో ఒక‌టి జ‌ర్మ‌నీ.  ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 51శాతం మందికి టీకా అందించారు.  అయితే, మొదట్లో ఈ దేశంలో వ్యాక్సినేషన్ ప్ర‌క్రియ నిదానంగా సాగింది.  ఆ త‌రువాత, వేగం పుంజుకుంది.  జ‌ర్మ‌నీ  ఛాన్స‌ల‌ర్ రెండు డోసుల్లో రెండు ర‌కాల టీకాలు తీసుకొని వార్త‌ల్లోకి వ‌చ్చారు.  

Read: ఇలా ఫోజిచ్చి…. నెగెటివ్ థాట్స్ వద్దంటే ఎలా!?

ఏప్రిల్ నెల‌లో మొదటిడోసుగా అస్త్ర‌జెన‌కా టీకా టీసుకున్న ఛాన్స‌ల‌ర్ మోర్కెల్ రెండో డోసుగా మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు.  వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌య్యి చాలా కాలం అవుతున్నా అనేక దేశాల్లో ఇప్ప‌టికీ వ్యాక్సినేష‌న్ స‌జావుగా జ‌ర‌గ‌డంలేదు.  కార‌ణం వ్యాక్సిన్ కొర‌త‌.  దీంతో ఒక‌రికి రెండు వేరువేరు ర‌కాల వ్యాక్సిన్లు ఇస్తే ఎలా ఉంటుంది… ఆరోగ్య స‌మ‌స్య‌లు ఏమైనా వ‌స్తాయా అనే కోణంలో శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు.  ఈస‌మ‌యంలో జ‌ర్న‌నీ ఛాన్స‌ల‌ర్ ఇలా రెండు వేరువేరు ర‌కాల డోసులు వేయించుకోవ‌డం విషేషం. 

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-