క‌ళ్ల‌ముందే రూ.1400 కోట్ల ఆస్తి… చిల్లిగ‌వ్వ‌కూడా ముట్టుకోలేని పరిస్థితి…

తినేందుకు చుట్టూ రుచిక‌ర‌మైన భోజ‌నం ఉన్న‌ది.  క‌డుపులో ఆక‌లిగా కూడా ఉన్న‌ది.  కానీ తినేందుకు వీలులేకుంటే ఆ వ్య‌క్తి ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే.  ఇలాంటి ప‌రిస్థితే ఓ వ్య‌క్తికి ఎదురైంది.  అతినిపేరు జార్జ్ వ‌లానీ.  1978లో ఆయిల్ అండ్ జ‌న‌ర‌ల్ మిల్స్ లిమిటెడ్ అనే కంపెనీకి డిస్ట్రిబ్యూట‌ర్‌గా ఉండేవాడు. ఈ కంపెనీ ఉద‌య్‌పూర్ కేంద్రంగా ఉండేది.  ఆ కంపెనీతో ఉన్న మంచి సంబంధాల కార‌ణంగా జార్జ్ ఆ కంపెనీకి సంబందించి 3500 షేర్లు కోనుగోలు చేశాడు.  అప్ప‌టికీ ఈ కంపెనీ లిస్టింగ్ కాలేదు.  ఆ త‌రువాత దాని గురించి మ‌ర్చిపోయాడు.  డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌హారం ప‌క్క‌న పెట్టి రెస్ట్ తీసుకుంటున్నాడు.  అయితే, పాత పేపర్లు స‌ర్దుతున్న స‌మ‌యంలో ఆ షేర్ల‌కు సంబందించి పేపర్లు బ‌య‌ట‌ప‌డ్డాయి.  షేర్ల‌ను డిమాట్ గా మార్చాల‌ని అనుకోగా కుద‌ర‌లేదు.  అప్ప‌టికే ఆ కంపెనీ పీఐ ఇండ‌స్ట్రీస్‌గా పేరు మార్చుకుంది.  అప్ప‌ట్లు కొనుగోలు చేసిన 3500 షేర్లు విలువ ఇప్పుడు రూ.1448 కోట్ల రూపాలుగా మారింది.  వెంట‌నే జార్జ్ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను క‌లిశారు.  అప్ప‌టికే డూప్లికేట్ పేరుతో ఆయ‌న షేర్ల‌ను వేరే వ్య‌క్తుల‌కు బ‌ద‌లాయించార‌ని తెలియ‌డంతో షాక్ అయ్యాడు.  ఈ విష‌యాన్ని సెబీకి తెలియ‌జేశాడు.  సెబీ లిస్టింగ్ కంపెనీ పీఐ ఇండ‌స్ట్రీస్‌ను వివ‌ర‌ణ కోరింది.  కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు.  ప్ర‌స్తుతం జార్జ్ త‌న షేర్ల‌కోసం ఫైట్ చేస్తున్నాడు.  మ‌రి ఆయ‌న‌కు త‌న షేర్లు ద‌క్కుతాయా చూడాలి.  

Read: ఆచంట‌లో కింగ్‌మేకర్‌గా మారిన జ‌న‌సేన‌…

-Advertisement-క‌ళ్ల‌ముందే రూ.1400 కోట్ల ఆస్తి... చిల్లిగ‌వ్వ‌కూడా ముట్టుకోలేని పరిస్థితి...

Related Articles

Latest Articles