జియో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌కు ఆ దేశ ప్ర‌ధానిగా అవ‌కాశం…

ఎప్పుడు ఎవ‌ర్ని అదృష్టం ఎలా వ‌రిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేదు.  ఒక దేశానికి ప్ర‌ధాని కావ‌డం అంటే అంత ఈజీ అయిన విష‌యం కాదు.  దేశంలోని ప్ర‌జ‌ల అభిమానాన్ని చొర‌గొనాలి.  పార్ల‌మెంట్‌లో మెజారిటీ సాధించాలి.  పార్టీలో ప‌ట్టు ఉండాలి.  అయితే, ఇవేమీ లేకుండానే ఓ మ‌హిళ‌కు ఆ దేశానికి ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం వ‌చ్చింది.  అయితే,  ఆమె ప‌రిణితి చెందిన విద్యావేత్త‌.  జియో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌.  విద్యాశాఖ త‌ర‌పుల ప్ర‌పంచ‌బ్యాంక్ నిర్వ‌హించిన అనేక ప్రాజెక్టుల్లో ఆమె పాలుపంచుకున్నారు.  ఆమె పేరు న‌జ్లా బౌడెన్ ర‌మ‌ధానె.  ఈ ఏడాది జులై 25 వ తేదీన ట్యూనీషియా అధ్య‌క్షుడు ఖాయిస్ సయీద్ పార్ల‌మెంట్‌ను ర‌ద్దు చేశారు.  దీంతో అప్ప‌టి ప్ర‌ధాని హిచెస్ ప్ర‌భుత్వం కూలిపోయింది.  ఆ త‌రువాత ఖాయిస్ దేశంలోని స‌ర్వాధికారాల‌ను త‌న గుప్పిట్లోకి తీసుకోవాల‌ని అనుకున్నాడు.  అయితే, ప్ర‌పంచ దేశాల నుంచి ఒత్తిడి రావ‌డంతో ప్ర‌ధానిగా జియో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్ న‌జ్లా ను నిమ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  అయితే, అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో దేశంలోని వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అధ్య‌క్షుడి ప‌రిధిలోకి వ‌స్తాయ‌ని అధ్య‌క్షుడు ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌ధాని అధికారాలు స్వ‌ల్పంగానే ఉంటాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.  

Read: షాపై దిగ్విజ‌య్ ప్ర‌శంస‌లు… ఆ సహాయం ఎప్ప‌టికి మ‌ర్చిపోను..

-Advertisement-జియో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌కు ఆ దేశ ప్ర‌ధానిగా అవ‌కాశం...

Related Articles

Latest Articles