పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి…

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం గన్ముకుల గ్రామంలో తెరాసా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ… ఉద్యోగాలను భర్తీ చేయలేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, రైల్వే వంటి సంస్థలలో కూడా ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఆ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెట్రోల్ ధరలు పెంచుతుంది. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. నన్ను గేల్పిస్తే స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తా అని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తే ముఖ్యమంత్రి ఆఫీస్ లోకి వెళ్లి , అభివృద్ధి పనుల గురించి మాట్లాడే మొఖం ఉండదు. ఉద్యమంలో నా మీద 130 కేసులు ఉన్నాయి.. మీరందరూ ఆశిర్వదించి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్న అన్నారు.

-Advertisement-పన్నుల మీద పన్నులు వేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలి...

Related Articles

Latest Articles