జీఈఎఫ్‌ ఇండియా సంస్థ కు అరుదైన గౌరవం

ఫ్రీడమ్‌ రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ తయారీదారు జెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎఫ్‌ ఇండియా) అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబాయిల్‌ అవార్డు 2021 వద్ద భారతదేశంలో అత్యధికంగా ముడి పొద్దు తిరుగుడు పువ్వు నూనె(క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌)ను దిగుమతి చేసుకుంటున్న సంస్థల విభాగంలో ప్లాటినమ్‌ అవార్డును అందుకుంది. వంటనూనెల పరిశ్రమలో పలు విభాగాలలో నిర్వహించే కార్యక్రమాలలో అత్యున్నత ప్రతిభను కనబరిచిన సంస్థలను గుర్తించడంలో అత్యంత విశ్వసనీయమైనది గ్లోబాయిల్‌ అవార్డ్స్‌. ఈ గుర్తింపుతో జీఈఎఫ్‌ ఇండియా భారతదేశంలో 2020–21 సంవత్సరానికిగానూ అత్యధికంగా క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటున్న సంస్థగా నిలుస్తుంది.

ఈ క్రూడాయిల్‌ను జీఈఎఫ్‌ ఇండియా యొక్క మూడు రిఫైనరీలలో ప్రాసెస్‌ చేస్తున్నారు. ఈ నూనెను నిర్ధిష్టమైన ప్రమాణాలకనుగుణంగా ప్రాసెస్‌ చేయడంతో పాటుగా విభిన్న మార్కెట్‌లలో పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి, సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్‌– సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ మాట్లాడుతూ ‘‘ గ్లోబాయిల్‌ అవార్డును అందుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. భారతదేశంలో అగ్రశ్రేణి క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతిదారునిగా నిలిచామిప్పుడు. తమ విలువైన మద్దతు అందించడంతో పాటుగా అభిమానాన్ని చూపిన మా వినియోగదారులు, పంపిణీదారులు, రిటైలర్లుకు ఈ సందర్భంగా ధన్యవాదములు తెలుపుతున్నాం. ఫ్రీడమ్‌ బ్రాండ్‌ ద్వారా, నాణ్యమైన ఉత్పత్తులను అత్యంత అందుబాటు ధరలలో వినియోగదారులకు అందిస్తున్నాం’’ అని అన్నారు.

ఆరోగ్యం పట్ల ఆప్రమప్తత పెరుగుతుండటంతో , నూనెల పట్ల అభిరుచి కూడా పెరుగుతుండటం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యవంతమైన నూనెలను మాత్రమే వాడాలని కోరుకుంటున్నారు. పామాయిల్‌ మరియు దీని ఫ్రాక్షన్స్‌ తో పోలిస్తే మృదువైన నూనె రకాలైనటువంటి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఆవ నూనె, వేరుశెనగ నూనె మరియు రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ను ఆరోగ్యవంతమైన నూనెలుగా భావిస్తున్నారు. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్‌ మరియు పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్నాయి. అంతేకాదు, అత్యధిక స్మోకింగ్‌ పాయింట్‌ కూడా దీనికి ఉంది. అందువల్ల ఈ నూనెను భారతీయ వంటకాలకు అత్యంత అనువైన నూనెగా భావిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా దీనిలో పోషకాలు నాశనం కావు. ఫ్రీడమ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లో విటమిన్స్‌ ఏ మరియు డీ ఉన్నాయి. దీనిలో అధిక మొత్తంలో విటమిన్‌ ఈ సైతం ఉంది. ఆరోగ్యాభిలాషులకు రోజువారీ వినియోగం కోసం కూడా ఇది అత్యంత అనుకూలమైనది.

సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా జీఈఎఫ్‌ ఇండియా నిలుస్తుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌, ఒడిషా వంటి రాష్ట్రాలలో ఫ్రీడమ్‌ బ్రాండ్‌ అగ్రస్ధానంలో కొనసాగుతుండంతో పాటుగా కర్నాటక రాష్ట్రంలలో మార్కెట్‌ వాటా పరంగా మూడవ స్థానంలో ఉంది (మూలం నీల్సన్‌). ప్రాంతీయ సంస్థ అయినప్పటికీ , 2021 ఆరిఽ్థక సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా ఈ కంపెనీ బ్రాండెడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విభాగంలో అగ్రశ్రేణి రెండు కంపెనీలలోఒకటిగా నిలిచింది.(మూలం నీల్సన్‌)2018లో గ్లోబాయిల్‌ ఇండియా ఎమర్జింగ్‌ బ్రాండ్‌ అవార్డును ఫ్రీడమ్‌ బ్రాండ్‌కు అందజేశారు.

జీఈఎఫ్‌ ఇండియా (ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్స్‌ ) గురించిజెమినీ ఎడిబల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (జీఈఎఫ్‌ ఇండియా) కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్‌ ఫ్రీడమ్‌. ఫ్రీడమ్‌ హెల్తీ కుకింగ్‌ ఆయిల్‌ శ్రేణి ఇప్పుడు ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌, ఫ్రీడమ్‌ ఫిజికల్లీ రిఫైండ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌, ఫ్రీడమ్‌ కా ఘనీ మస్టర్డ్‌ ఆయిల్‌ మరియు ఫ్రీడమ్‌ గ్రౌండ్‌ నట్‌ ఆయిల్‌ రూపంలో లభిస్తుంది. ఫ్రీడమ్‌ రిఫైండ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను 2010లో ఆంధ్రప్రదేశ్‌ మరియు ఒడిషాలో విడుదల చేశారు. ఫ్రీడమ్‌ ఫిజికల్లీ రిఫైండ్‌ రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ ను 2015లో ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణాలో విడుదల చేశారు. ఇండియా టుడే ఇప్సోస్‌ అర్బన్‌ కన్స్యూమర్‌ సెంటిమెంట్‌ సర్వే 2020 ప్రకారం భారతదేశంలో టాప్‌ 5 వంటనూనెల బ్రాండ్స్‌లో ఒకటిగా ఫ్రీడమ్‌ను గుర్తించింది.
––––
జీఈఎఫ్‌ ఇండియా తమ తొలి పబ్లిక్‌ ఈక్విటీ షేర్లను జారీ చేయడం కోసం అవసరమైన అన్ని అనుమతులు, వర్తించే చట్టబద్ధమైన మరియు నియంత్రణ అవసరాలకు లోబడి డీఆర్‌హెచ్‌పీ ని ఆగస్టు 07,2021వ తేదీన సమర్పించింది. ఈ డీఆర్‌హెచ్‌పీ సెబీ వెబ్‌సైట్‌ www.sebi.gov.in వద్ద, స్టాక్‌ ఎక్సేంజ్‌లు అయినటువంటి బీఎస్‌ఈ www.bseindia.com, , ఎన్‌ఎస్‌ఈ (www.nseindia.com) వద్ద మాత్రమే గాక సంబంధిత బీఆర్‌ఎల్‌ఎం అయినటువంటి యాక్సిస్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ (www.axiscapital.co.in,), క్రెడిట్‌ సుస్సీ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (www.credit-suisse.com/in/en/investment-banking-apac/investment-banking-in-india/ipo.html,) , కొటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ లిమిటెడ్‌ (www.investmentbank.kotak.com), నోమురా ఫైనాన్షియల్‌ అడ్వైజరీ అండ్‌ సెక్యూరిటీస్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (www.nomuraholdings.com/company/ group/asia/india/index.html.) వద్ద లభ్యమవుతుంది.

ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు అత్యధిక రిస్క్‌తో కూడి ఉన్నవని సంభావ్య మదుపరులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ తరహా ప్రమాదాలను గురించిన పూర్తి వివరాలు కోసం రిస్క్‌ ఫ్యాక్టర్స్‌ పేరిట ఉన్న రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్సెక్టస్‌ను చూడవచ్చు. సంభావ్య మదుపరులు కేవలం సెబీ వద్ద దాఖలు చేసిన డీఆర్‌హెచ్‌పీ మాత్రమే చూడటం కాకుండా తమ సొంత పెట్టుబడి నిర్ణయం తీసుకోగలరు.

Social Media handles

FreedomHealthyOil @freedomhealthyoil
FreedomHealthyOil @freedomhealthyoil
For further information, please contact: KONNECTIONS IMAG
Sunil Kumar M: 9866520337 / [email protected]
Anand: 8309129428 / [email protected]

-Advertisement-జీఈఎఫ్‌ ఇండియా సంస్థ కు అరుదైన గౌరవం

Related Articles

Latest Articles