రోహిత్ లో అదే బాగా నచ్చింది : గంభీర్

యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్‌ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే కాకుండా.. బ్యాటర్ గా కుడా రోహిత్ రాణించాడు. ఈ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు రోహిత్ శర్మనే.

అయితే తాజాగా రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. ఈ సిరీస్ లో కెప్టెన్సీ బాధ్యతలు వచ్చినా కూడా రోహిత్ ఒత్తిడికి గురి కాలేదు. అలాగే కెప్టెన్సీ అనేది బ్యాటర్ యొక్క స్వేచ్ఛను తీసుకుంటుంది.. కానీ ఈ మ్యాచ్ లో రోహిత్ పూర్తి స్వేచ్ఛతో బ్యాటింగ్ చేసాడు. అది బాగా ఆకట్టుకుంది అంతేకాకుండా ఈ సిరీస్ లో రోహిత్ బ్యాటింగ్ మరింత మెరుగైంది అని గంభీర్ చెప్పాడు. అలాగే మూడో టీ20 మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తునందున్న… మంచు ప్రభావం ఎక్కువ పడకుండా ప్రారంభంలోనే స్పిన్నర్లను తీసుకువచ్చిన రోహిత్ ఎత్తుగడ అతని కెప్టెన్సీ సామర్థ్యాన్ని చూపుతుంది అని గంభీర్ పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles