గౌత‌మ్ గంభీర్‌కు షాక్‌.. ఆప్ ఎమ్మెల్యేకు కూడా..!

బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్‌ గౌత‌మ్ గంభీర్ ప‌రిస్థితి ఏదో చేయ‌బోతే.. ఇంకా ఏదో అయిన‌ట్టుగా త‌యారైంది.. క‌రోనా బాధితుల కోసం ఆయ‌న ఫాబీఫ్లూ ట్యాబెట్ల‌ను పంపిణీ చేస్తే.. అస‌లే ట్యాబెట్లు దొర‌క‌క క‌ష్టాలు ప‌డుతున్న స‌మ‌యంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్ల‌ను అక్ర‌మంగా నిల్వ చేశార‌ని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ విచార‌ణ చేప‌ట్టి.. గౌతం గంభీర్ ఫౌండేష‌న్ అక్ర‌మంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను నిల్వ చేసింద‌ని.. ఈకేసులో గంభీర్ ఫౌండేష‌న్ దోషిగా తేలిన‌ట్టు హైకోర్టుకు తెలిపింది ఢిల్లీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ శాఖ‌.. అడ్వ‌కేట్ నందితా రావు డ్ర‌గ్ కంట్రోల‌ర్ త‌ర‌పున వాద‌న‌లు వినిస్తూ.. డ్ర‌గ్స్ అండ్ కాస్మ‌టిక్స్ యాక్ట్ కింద గంభీర్ ఫౌండేష‌న్ నేరం చేసిన‌ట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదే యాక్ట్ కింద ఆప్ ఎమ్మెల్యే ప్ర‌వీణ్ కుమార్ కూడా దోషిగా తేలిన‌ట్లు తెలిపారు.. దీంతో.. ఆ ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీసీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు.. త‌దుప‌రి విచార‌ణ‌ను జూలై 29వ తేదీకి వాయిదా వేసింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-