మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు మరోసారి ఎల్‌పీజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈ రోజు నుంచే అమలులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. అయితే.. ఇక్కడ ఊర కలిగే అంశం ఒకటుంది.ఈ సారి 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రమే పెరిగింది. ఈ సిలిండర్‌ ధర రూ. 45 మేర పైకి కదిలింది. ఇక పోతే 14 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు పెరగడం మూలంగా ఈ సారి కూడా మాములు సిలిండర్‌ ధర పెరుగుతుందని.. చాలా మంది భావించారు. రూ. 1000 దాటేస్తుందని అంచనా వేశారు. కానీ బీజేపీ సర్కార్‌ మాత్ర సిలిండర్‌ ధరను స్థిరంగానే కొనసాగించింది.

-Advertisement-మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..

Related Articles

Latest Articles