ఆఫ్ఘన్ కాందిశీకుల వెతలపై ‘గార్డ్’ చిత్రం!

ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్‌ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక సుభాష్ కాలేతో కలిసి ‘రాయ్’, ‘ఆల్ ఈజ్ వెల్’ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘గార్డ్’ కోసం జత కట్టడం విశేషం.

Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ

‘గార్డ్’ మూవీ గురించి అజయ్ కపూర్ మాట్లాడుతూ, ”సుభాష్, నేను కలిసి కొన్నేళ్ళుగా ప్రయాణం సాగిస్తున్నాం. అతను ఇటీవల ‘గార్డ్’ స్క్రిప్ట్ చెప్పగానే నాకు నచ్చేసింది. వెంటనే అంగీకారాన్ని తెలిపాను. ఈ కథలో భావోద్వేగాలతో పాటు దేశభక్తి పూరితమైన అంశాలు, స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. ఈ కథకు సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాం” అని అన్నారు. మరో నిర్మాత సుభాష్‌ కాలే మాట్లాడుతూ, ”’గార్డ్‌’ నాకు వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. ఈ కథ మీద కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాను. దీనికి అజయ్ కపూర్ లాంటి నిర్మాత సాయం దొరకడం ఆనందంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో తెరపై చూపించాలన్నది మా కోరిక’ అని అన్నారు.

ఈ చిత్రం కోసం ‘మేరా భారత్ హై మహాన్’ అంటూ ఓ నేపథ్య గీతాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ‘మిషన్ మంగళ్’కు రచన చేసిన నిధి సింగ్ ధర్మా వర్క్ చేశారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులతో పాటు దర్శకుడి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఆగస్ట్ 15న విడుదల స్వాతంత్రదినోత్సవ కానుకగా విడుదల కానుంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-