ఏపీ సర్కార్ కు గన్నవరం చిక్కులు తప్పవా?

ఏపీకి అత్యంత కీలకమైన పోర్టుల్లో గన్నవరం పోర్టు ఒకటి. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఈ పోర్టు ప్రస్తుతం పూర్తిగా ప్రైవేటుపరం అవుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి హిటెక్కుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారుకు ప్రస్తుతం గన్నవరం పోర్టు ప్రైవేటు చేతిలోకి పోతుండటంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు ప్రతిపక్షాలకు ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి ఏజెండాగా ముందుకెళుతోంది. గత రెండేళ్లుగా సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. కరోనా సమయంలో ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయి. మరోవైపు రాబోయే ఎన్నికలపై దృష్టిసారించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీంతో ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఎప్పుడు అవకాశం దొరకుతుందా? అని గోతికాడా నక్కలా ఎదురుచూస్తున్న ప్రతిపక్షాలకు గన్నవరం పోర్టు అంశం కలిసొచ్చినట్లు కన్పిస్తుంది.

గన్నవరం పోర్టులో ఏపీ సర్కారు వాటా 10.4శాతం ఉంది. అదానీ గ్రూప్ వాటా 51శాతంగా ఉంది. అతిపెద్ద వాటాదారుగా ఉన్న అదానీ గ్రూప్ ఇటీవల గన్నవరం పోర్టులో ఉన్న కొన్ని వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఏడాది డీవీఎష్ రాజు కుటుంబ సభ్యులకు గన్నవరం పోర్టులో ఉన్న వాటాను కొనుగోలు చేసింది. వీరితోపాటు మరికొన్ని వాటాలను ఆ సంస్థ చేజిక్కించుకుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం వాటాను కూడా అదానీ గ్రూపు దక్కించుకుంది. దీంతో గన్నవరం పోర్టులో అదానీ వాటా ఏకంగా 95శాతానికి చేరినట్లు తెలుస్తోంది. గన్నవరం పోర్టు దాదాపుగా ప్రైవేటీకరణతో సమానమని మేధావులు, నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ ప్లాంట్ ను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న ఏపీ సర్కారు ప్రభుత్వ వాటాను అదానీ గ్రూప్ కు అమ్మివేయడంపై విమర్శలను ఎదుర్కొంటుంది. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. గంగవరం, కృష్ణపట్నం పోర్టుల విషయంలో లోపాలపై లోకాయుక్తతో దర్యాప్తు జరిపించాలని, ప్రొప్రైటీ ఆడిట్‌ నిర్వహించేలా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబాళ్లపల్లికి చెందిన డాక్టర్‌ సత్య భూపాల్‌రెడ్డి, గిద్దలూరుకు చెందిన బొంత పూర్ణచంద్రారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపడుతుండటంతో ప్రభుత్వం తన వాదనలు విన్పిస్తోంది.

గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకంపై ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందని ఏజీ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టుకు వివరించారు. వాటా విక్రయంపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు వాటాల విక్రయాన్ని కూడా గన్నవరం పోర్టు విక్రయంతో కలపడాన్ని జగన్ సర్కార్ హైకోర్టులో వ్యతిరేకించింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం గన్నవరం పోర్టులో ప్రభుత్వం వాటా అమ్మకానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు లింకులు పెడుతూ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ సర్కారు విశాఖ స్టీట్ ప్లాంట్ విషయంలో తన వైఖరిని మరోసారి స్పష్టం చేయాల్సి వస్తోంది. ఏదిఏమైనా గన్నవరం పోర్టు అంశం ఇప్పుడు ఏపీని రాజకీయంగా కుదిపివేస్తున్నట్లు కన్పిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-