విజయనగరం పరిధిలో భారీగా పట్టుబడ్డ గంజాయి…

విజయనగరం రురల్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనాల తనిఖీ నేపధ్యంలో విజయనగరం ఏజెన్సీ నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనం పై అనుమానంతో తనిఖీ చేపట్టారు పోలీసులు. అందులో అల్లం మాటున గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. వాహనంలో అల్లం కాకుండా 3 వేల కేజీల గంజాయిని గుర్తించారు పోలీసులు. దొరికిన గంజాయి విలువ 1.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దాంతో ఆ వాహనం తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటు వెల్లడించారు ఎస్పీ రాజకుమారి. సిమిలిగూడలో గంజాయిలోడు చేసినట్టు అంగీకరించిన నిందితులు… ఢిల్లీకి తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రూరల్ పోలీసులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-