వెండితెరపై గంగూలీ బయోపిక్!

ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్‌ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రికెటర్ బయోపిక్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఆటగాడుగా కెప్టెన్ గా ఎందరినో ప్రోత్సహించి భారతీయ క్రికెట్ కు స్పీడ్ జోడించిన క్రికెటర్ సౌరవ్ గంగూలి. ప్రస్తుతం బిబిసిఐ అధ్యక్షుడు గా ఉన్న సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. లూవ్ ఫిల్మ్స్ ఈ బయోపిక్‌ తీస్తున్నట్లు గంగూలీ ట్వీట్ చేశాడు. 21 వ శతాబ్దంలో భారత క్రికెట్ విప్లవం వెనుక ఉన్న వ్యక్తి గంగూలీ. కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గంగూలీ పలువురు యువ క్రికెటర్లను ప్రోత్సహించాడు. హర్భజన్ సింగ్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ధోనీ వంటి వారు గంగూలీ కెప్టెన్సీలో అరంగేట్రం చేసినవారే. గంగూలీ హయాంలో టీమిండియా చిరస్మరణీయ విజయాలు నమోదు చేసింది. గంగూలీ బయోపిక్‌ను లువ్ ఫిల్మ్స్ పతాకంపై లవ్ రంజన్ నిర్మించనున్నారు. గంగూలీ పాత్రను పోషించే నటుడు ఎవరు? ఇతర తారలు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-