‘గంగూభాయ్‌’ విడుదల తేదీ లాక్

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం ‘గంగూభాయ్‌ కతియావాడి’.. దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 1960లలో ముంబై రెడ్‌లైట్‌ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన గంగూభాయ్‌ కతియావాడీ బయోపిక్‌ పాత్రలో గంగూభాయ్‌ గా ఆలియాభట్‌ నటించింది. 2019, డిసెంబర్‌ 8న గంగూబాయ్ షూటింగ్‌ను ప్రారంభించగా, రీసెంట్ గా సినిమా పూర్తయ్యింది. ఈ మధ్యలో రెండుసార్లు లాక్‌డౌన్‌, రెండు తుఫానులు కూడా వచ్చి వెళ్లాయి. ఈ సినిమా ఓటీటీలో విడుదల అంటూ ప్రచారం కూడా జరిగింది.

అయితే తాజాగా ‘గంగూభాయ్‌ కతియావాడి’ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. జనవరి 6, 2022న థియేటర్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక భన్సాలీ దర్శకత్వంలో చేయాలనేది తన కోరికగా ఆలియా భట్ చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆమె చాలా నమ్మకంగా వుంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతికే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Image
-Advertisement-‘గంగూభాయ్‌’ విడుదల తేదీ లాక్

Related Articles

Latest Articles