‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ రిపీట్స్… బట్ విత్ ఏ ట్విస్ట్!

మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్దీఖీ, పంకజ్ త్రిపాఠీ… ఈ ముగ్గురి పేర్లు చెప్పగానే… వెంటనే ఎవరికైనా అనురాగ్ కశ్యప్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ గుర్తుకు వస్తుంది. రియలిస్ట్ సినిమా లవ్వర్స్ కి ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకం ఆ సినిమా. అందులో మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ, పంకజ్ త్రిపాఠీ పోటీ పడి నటించారు. అయితే, త్వరలో వీరు ముగ్గుర్నీ ఒకేసారి తెరపై చూడవచ్చు!

మనోజ్, పంకజ్, నవాజుద్దీన్ కలసి నటించింది మూవీ కాదు. చిన్న కమర్షియల్ యాడ్ మాత్రమే. అయితే, పంకజ్ త్రిపాఠీ సాధారణంగా అడ్వర్టైజ్మెంట్లలో నటించడు. కమర్షియల్స్ కి ఆయన వ్యతిరేకం. కానీ, మనోజ్ బాజ్ పాయ్, నవాజుద్దీన్ సిద్ధీఖీ ఓ వంట నూనె బ్రాండ్ ను ప్రొమోట్ చేస్తున్నారని తెలిసి… పంకజ్ కూడా యాడ్ చేశాడట. తన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ కోస్టార్స్ ని మరోసారి షూటింగ్ సెట్ మీద కలవొచ్చని త్రిపాఠీ భావించాడు.

బాజ్ పాయ్, సిద్ధీఖీ, త్రిపాఠీ కలసి కనిపించే యాడ్ షూటింగ్ మార్చ్ లో జరిగింది. త్వరలో టీవీ ఛానల్స్ లో ప్రసారం కానుందట. అయితే, పంకజ్ త్రిపాఠీ ఆశించినట్టు ‘గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్’ సహ నటులు ముగ్గురూ ఒకేసారి కెమెరా ముందుకు రాలేకపోయారట. మార్చ్ నాటికే సెకండ్ వేవ్ కాస్తో, కూస్తో ఉండటం వల్ల మనోజ్ బాజ్ పాయ్ కరోనా బారిన పడ్డాడు. అందుకే, ఒకే రోజు నవాజుద్దీన్, పంకజ్ కలసి యాడ్ పూర్తి చేశారు. తరువాత నెగటివ్ రిపోర్ట్ వచ్చాక మనోజ్ బాజ్ పాయ్ తన వంతు షూటింగ్ గ్రీన్ మ్యాట్ ఎదురుగా చేశాడు! యాడ్ లో మాత్రం ముగ్గురూ కలిసే కనిపిస్తారు!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-