మెగా ఛాన్స్ పట్టేసిన గంగవ్వ

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినిమాను ప్రారంభించారు. ‘గాడ్‌ ఫాదర్‌’ను ఎన్‌వి ప్రసాద్, రామ్ చరణ్‌లతో కలిసి ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రబృందం ‘గాడ్ ఫాదర్’లోని పాత్రల కోసం మిగిలిన నటీనటులు, సిబ్బందిని ఖరారు చేయడంలో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రంలో గంగవ్వ ఓ మంచి అవకాశాన్ని పట్టేసినట్లు తెలుస్తోంది.

Read Also : గాయాల పాలైన రామ్… ఆగిన షూటింగ్

యూట్యూబ్ ఛానెల్‌ లోని ఓ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వ తరువాత ‘బిగ్ బాస్-4’లోకి హౌస్ మేట్ గా ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఇప్పుడు ఆమె ‘గాడ్ ఫాదర్’లో గంగవ్వ ఒక అతిధి పాత్రలో కనిపించనుంది. కొంతమంది మాత్రం ఇందులో గంగవ్వ చిరంజీవి తల్లిగా నటించబోతోంది అంటున్నారు. ఏదేమైనా గంగవ్వ మెగా ఆఫర్ అయితే పట్టేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి గంగవ్వ నిజంగానే ఈ సినిమాలో నటిస్తోందా ? అనేది చూడాలి.

-Advertisement-మెగా ఛాన్స్ పట్టేసిన గంగవ్వ

Related Articles

Latest Articles