సెప్టెంబర్‌ 10 నుంచి గణేష్‌ ఉత్సవాలు.. 19న నిమజ్జనం.. కానీ..!

హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… ఈ ఉత్సవాల్లో భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది.. కరోనా మహమ్మారి కారణంగా.. గత ఏడాది ఉత్సవాలు కళ తప్పాయి.. ఈసారి కూడా అప్పటి వరకు కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది.. ఈ ఏడాది 10 సెప్టెంబర్‌న గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయని.. 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ భగవంత రావు.. గణేష్ విగ్రహాల తయారీకి కావాల్సిన ఏకో ఫ్రెండ్లీ, రా మెటీరియల్ అందించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్న ఆయన.. గణేష్ ఉత్సవాలకు 21 రకాల ఔషద మొక్కల కొరత ఉంది.. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ మొక్కలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చూడాలన్నారు.

ఇక, గణేష్ నిమజ్జనికి వెళ్లే మార్గాలను బల్దియా అధికారులు బాగు చేయాలని.. నిమజ్జనం సందర్భంగా ముందే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి.. ఈ సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు.. కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు నేపథ్యంలో కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలని అన్ని గణేష్ మండపాల నిర్వహకులను కోరారు భగవంతరావు.. గణేష్ విగ్రహాలో ఎత్తు గురించి పోటీ పడకుండా నిమజ్జనానికి సులువుగా ఉండేలా నిరాడంబరంగా ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆయన.. దేశ భక్తి, దైవ భక్తి ప్రేరేపించే కార్యక్రమమలు మాత్రమే ఉత్సవాల్లో చేయాలని.. పార్టీలకు అతీతంగా ఉత్సవాలను విజయవంతం చేయాలని.. కోవిడ్ దృష్ట్యా ఎత్తు గురించి పోటీ పడొద్దని సూచించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం విధి.. ఏర్పాట్లు చేయకపోతే ఏంచేయాలి అనేదానిపై తదుపరి చర్యలు ఉంటాయన్నారు.. గణేష్ ఉత్సవాల ద్వారా ఎలాంటి పొల్యూషన్ లేదని.. అయితే, ఉత్సవాలల్లో ఎక్కువ మంది గుమ్మికూడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-