బీజేపీ నుంచి కరిపే గణేష్‌ బహిష్కరణ: బస్వలక్ష్మీ నర్సయ్య

నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన సురేష్‌ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కరిపే గణేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ప్రతిష్ఠకు భంగం కల్గిస్తూ.. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

Read Also: పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ సందర్శించిన సీపీ

కరిపె గణేష్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్టు తెలిపారు. కరిపే గణేష్‌ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని బస్వలక్ష్మీ నర్సయ్య వెల్లడించారు. కాగా ఎవరైనా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావొద్దని ఆయన కోరారు.

Related Articles

Latest Articles