బెల్లంకొండ హీరోనే వర్జిన్ వా అని అడిగిన హీరోయిన్..

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వాతి ముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ఇక తాజాగా సంక్రాంతి పండగను పురస్కరించుకొని ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘స్వాతి ముత్యం’ ఫస్ట్ గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. అమాయకమైన పాత్రలో హీరో కనిపించగా.. కొంచెం గడుసు అమ్మాయిగా హీరోయిన్ కనిపించింది. కొడుకుకు పెళ్లి చేయడానికి తాపత్రయ పడే ఒక తండ్రి.. అతని కోసం పిల్లను వెతికి, నచ్చేలా చేసి చివరికి అతడికి పెళ్లి ఎలా చేశాడు అనేది కథగా తెలుస్తోంది.

ఇక పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ ఆ జంట సంతోషంగా ఉన్నారా..? ఆ తర్వాత ఎదురైనా సమస్యలు ఏంటి అనేది వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక ఈ వీడియోలో హీరోయిన్ నువ్వు వర్జినా? అని ముఖం మీద అడగడం హైలైట్ గా మారింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Related Articles

Latest Articles