ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న క‌రోనా… డెల్టాకు తోడు గామా…

ప్ర‌పంచంలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతూనే ఉన్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి అనేక దేశాల్లో క‌రోనా తిరిగి విజృభిస్తున్న‌ది.  క‌రోనాకు తొలి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన ర‌ష్యాలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.  క‌రోనాకు వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన‌ప్ప‌టికీ ఆ దేశంలో వ్యాక్సినేష‌న్ మంద‌కోడిగా సాగుతున్న‌ది.  ఇప్ప‌టికే ఆ దేశంలో నాలుగు ర‌కాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  ర‌ష్యాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండ‌టంతో పాటుగా ఇప్పుడు ఆ ర‌ష్యాలో గామా వేరింట్ కేసులు కూడా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  

Read: ముస్తఫా మొదటి భార్య ఆరోపణలపై.. స్పందించిన ప్రియమణి

డెల్టా, గామా రెండు కూడా ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా ఇప్ప‌టికే ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ గుర్తించింది. రెండు ర‌కాల వేరియంట్లకు వేగంగా వ్యాప్తిచెందే ల‌క్ష‌ణం ఉంటుంది.  ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ర‌ష్యా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రిగా ఫాలో కావాల‌ని హెచ్చ‌రించింది.  గురువారం రోజుల ఆ దేశంలో 24 వేల‌కు పైగా కేసులు న‌మోదు కావ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అని చెబుతున్నారు.  జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే మ‌రోసారి భారీ మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-