ఆయన చెప్పిన మాటల్లో 90శాతం అబద్దాలే…

వరంగల్ లో ఎంపీటీసీల సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడీల కుమార్ మాట్లాడుతూ… మా సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. గత మార్చి 22న కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీలు కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారు. గత బడ్జెట్లో మాకు 500 కోట్ల నిధులు కేటాయించారు, కరోనా కారణంగా విడుదల నిధులు విడుదల కాలేదు. కొందరు సభ్యులు స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడివని చెప్పి నిన్న మాట్లాడిన వాసుదేవ రెడ్డికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన చెప్పిన మాటల్లో 90శాతం అబద్దాలే. హుజూరాబాద్ ఎన్నికల్లో సంఘం తరఫున ఎవరూ పోటీచేయరు. మా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం అని తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-