“నీ హిప్స్ చాలా పెద్దవి, తొడలు చాలా మందం…” అనేవారు

గాబ్రియెల్లా డెమిట్రియాడెస్… ఎవరో తెలుసా? నాగార్జున ‘ఊపిరి’ సినిమాలో కనిపించిన వైట్ బ్యూటీ! అయితే, బాలీవుడ్ లో ఈమె అర్జున్ రాంపాల్ పార్ట్ నర్ గా ఫేమస్! పెళ్లి చేసుకోకుండానే ఈ లవ్ బర్డ్స్ 2018లో ఒక బాబుకి జన్మనిచ్చేశారు! అయితే, స్వంతంగా ఒక ఫ్యాషన్ లేబుల్ కూడా ఉన్న ఈ హాట్ బ్యూటీ మొదట్లో మోడల్ కూడా. అప్పటి అనుభవాన్ని తాజాగా నెటిజన్స్ తో షేర్ చేసుకుంది గాబ్రియెల్లా… ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ కండక్ట్ చేసిన లేడీ రాంపాల్ ఓ ప్రశ్నకి బదులిస్తూ “అప్పట్లో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇప్పుడున్నంత వైవిధ్యంగా ఉండేది కాదు. చాలా మంది నేను తగినంత పొడుగ్గా లేనని చెప్పేవారు. నా కటి భాగం పెద్దగా ఉందనీ, తొడలు మందంగా ఉన్నాయని అనేవారు. వారికి నచ్చనిది ప్రతీది విమర్శించేసే వారు.

చాలా రోజులకుగానీ, నాకు వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అర్థం కాలేదు…” అంది గాబ్రియెల్లా! తన మోడలింగ్ డేస్ గురించి చెప్పిన గాబ్రియెల్లా కొడుకు ‘అరిక్’ గురించి కూడా స్పందించింది. ఒక ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్ “క్యాన్ ఐ అడాప్ట్ యువర్ సన్?” అంటూ కొంటెగా ప్రశ్నిస్తే… “నో ఐయామ్ కైండా అబ్సెస్డ్” అని జవాబిచ్చింది! ఇంకో నెటిజన్ “ఫేవరెట్ పిక్ ఆఫ్ అర్జున్ అండ్ యూ?” అని అడిగితే… నాలుగు రొమాంటిక్ ఫోటోలు జత చేసి జనం ముందుంచింది! అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెస్సియాను వివాహమాడాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. మహికా, మైరా. 2018లో మొదటి భార్య నుంచీ విడిపోయిన అర్జున్ అదే సంవత్సరం గాబ్రియెల్లా ద్వారా కొడుకు అరిక్ కి తండ్రి అయ్యాడు!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-