వచ్చేసిన ‘గానా ఆఫ్ రిపబ్లిక్’!

సాయిధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘రిపబ్లిక్’. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాను దేవా కట్ట డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… నేపధ్యంలో వాడి వేడి చర్చలతో ఈ మూవీ ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. సివిల్ సర్వెంట్స్ సైతం పొలిటీషియన్స్ కనుసన్నలలో మెలగాల్సిన అగత్యం ఏమిటని? ఇందులో సాయిధరమ్ ప్రశ్నించడం విశేషం. కాలేజీ రోజుల నుండి విప్లవభావాలతో పెరిగిన ఓ వ్యక్తి సివిల్ సర్వెంట్ అయితే… నేతలను ఎలా ఎదిరిస్తాడో ఇందులో చూపుతున్నట్టుగా ఉంది.

Read Also: ఈ 5 ‘బోల్డ్’ వెబ్ సిరీస్ లు మీరింకా చూడలేదా? అయితే, ‘బోలెడంత’ మిస్ అవుతోన్నట్టే!

తాజాగా ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ పేరుతో విడుదల చేసిన పాటను రెహమాన్ రాశారు. మణిశర్మ స్వరపరిచారు. మెలోడీ బ్రహ్మ పుట్టిన రోజు జూలై 11 సందర్భంగా ఈ పాటను మేకర్స్ విడుదల చేశారనిపిస్తోంది. ‘ఎయ్ రా రో’ అంటూ సాగే ఈ కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, ధనుంజయ్, హైమత్ మహ్మద్, ఆదిత్య అయ్యంగార్, పృధ్వీచంద్ర పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూర్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘రిపబ్లిక్’ త్వరలోనే జనం ముందుకు రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-